సత్యసాయి: ముదిగుబ్బ మండలం బూదలమ్మ చెరువు నుంచి చింతకుంట చెరువుకు ఫీడర్ ఛానల్ నిర్మాణ పనులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. సుమారు రూ.25 లక్షల వ్యయంతో కొండలను తొలగించి ఈ లింక్ ఛానల్ నిర్మిస్తున్నారు. దీనివల్ల వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు.