MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని PACS కార్యాలయం వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి మోసపోవద్దని ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిపల్లి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.