సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా విడుదలపై దర్శకుడు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపాడు. మే 4న కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి, మే 14న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించాడు. వినోదం కోసం ఇది సరైన సమయమని ఆయన భావిస్తున్నాడు.