NLG: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ మిర్యాలగూడలో గౌతు లచ్చన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీసీ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని నాయకులు కొనియాడుతూ.. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో దాసరాజు జయరాజు, చేగొండి మురళి యాదవ్, మాలోతు దశరథ్ తదితరులు పాల్గొన్నారు.