జగిత్యాల కలెక్టరేట్లో పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్యావరణ సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపులో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.