WGL: పోలీస్ అధికారులకు పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ CP సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పరిపాలన విభాగం అదనపు ఎస్పీలుగా పదోన్నతులపై బదిలీపై వెళ్తున్న ఏఎస్పీలు శుభం ప్రకాష్, చేతన్ నితిన్‌లను CP సన్మానించారు. ఇరువురు అధికారులు అప్పగించిన పనులు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, నేరాల నియంత్రణలో వారి ప్రత్యేకత చాటుకున్నారని అన్నారు.