NLR: పొన్నలూరు మండలం ముప్పాళ్ళ హైస్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడు ఆకురాతి బలరామకృష్ణ పదవీ విరమణ సభ కందుకూరులోని జనార్ధన స్వామి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, బలరామకృష్ణ ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చారని ప్రశంసించారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.