NLG: ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అరూరి శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల మండలం వెలిమినేడులో ఇవాళ రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను పరిశీలించి మాట్లాడారు. రైతులకు అవసరమైన తార్పాలు పట్టాలను, మంచినీటి వసతి, టెంట్ సౌకర్యాలు కల్పించి, కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు.