రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిందని, కేవలం ఒక ఐటెం సాంగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ సంయుక్త మీనన్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, అంతా కుదిరితే ఈ క్రేజీ ప్రాజెక్టులో సంయుక్త తన స్టెప్పులతో అలరించడం ఖాయమని ఫిల్మ్ నగర్ టాక్.