AP: రాష్ట్రవ్యాప్తంగా 48 వేల మంది మున్సిపల్ కార్మికులు రేపు సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రతినెలా టైంకు వేతనాలు అందక కుటుంబ పోషణ భారమైందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ నిరసనతో ప్రధాన నగరాల్లో చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణ పనులు స్తంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం చర్చలకు వచ్చి పరిష్కారం చూపే వరకు విధులకు హాజరయ్యేది లేదని కార్మికులు చెబుతున్నారు.