VKB: పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఉప సర్పంచ్ మోహిద్ ప్రవర్తనపై వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న జరిగిన గ్రామసభలో సర్పంచ్ స్థానంలో వ్యవహరించడం, వార్డు సభ్యులను అవమానించడం, సభ నుంచి వెళ్లిపోవాలని చెప్పడం వంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.