కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ ఆదివారం అన్నారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించాలని కోరారు. తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.