SDPT: లోక్‌సభలో తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.