TPT: పిచ్చాటూరు(మం) అడవి కోడియం బేడు గ్రామంలో శుక్రవారం విద్యుత్ తీగలు తెగిపడటంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన రైతు కేవీ భాస్కర్ నాయుడుకి సంబంధించిన ఒక ఎకరా చెరకు తోట పూర్తిగా కాలి బూడిదైంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానిక రైతులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఎకరా తోట పూర్తిగా కాలిపోయింది.