KNR: మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా సోమవారం హుజురాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, శంకర్, సోషల్ మీడియా కన్వీనర్ రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సదానందం, రామకృష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.