TG: ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేతో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తోందన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు.