నైజీరియాలో భారీ వైమానిక దాడి జరిగి 200 మందికి పైగా మరణించారని సమాచారం. ఈశాన్య ప్రాంతంలో ఉన్న యోబో-బోర్నో రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో నైజీరియా ఎయిర్ఫోర్స్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. తీవ్రంగా గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రభుత్వ ఎయిర్ఫోర్స్ వైమానిక దాడుల వల్ల ఇన్ని వందల మంది పౌరులు చనిపోవడం ఇప్పుడు నిరసనలకు దారితీస్తోంది.