KMM: ప్రమాదవశాత్తు మృతి చెందిన వైరా మండలం లాలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత నామా శ్రీనివాసరావు పార్థివదేహానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. సాగును కోతుల నుంచి కాపాడుకునే క్రమంలో రేకుల షెడ్‌పై నుంచి పడి శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.