వాల్నట్స్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. బరువును నియంత్రించడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో ఇవి సహాయపడుతాయి. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.