JGL: నిరుపేదలకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండలం మంగేళ గ్రామంలో మహేందర్, వైష్ణవి కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేదల జీవితాల్లో మార్పు వస్తోందన్నారు. లబ్ధిదారులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.