GDWL: అలంపూర్ చౌరస్తాలో శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ఫూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల విద్య కోసం ఫూలే చేసిన కృషిని కొనియాడారు. చట్టసభల్లో బీసీలకు 52% రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరించడాన్ని ఆయన విమర్శించారు.