NRPT: పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య అన్నారు. నారాయణపేటలోని తన కార్యాలయంలో శనివారం జిల్లాలోని ఎస్సై, సీఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించి పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇచ్చారు. నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని అన్నారు.