Gmail వినియోగదారులకు గూగుల్ అదిరిపోయే శుభవార్త అందించింది. వాట్సాప్ తరహాలో ‘ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్’ ఫీచర్‌ను మొబైల్ యాప్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. దీంతో పంపేవారు, స్వీకరించేవారు తప్ప మధ్యలో మరెవరూ మెయిల్స్ చదవలేరు. ప్రస్తుతం వర్క్‌స్పేస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్, వ్యక్తిగత సమాచారానికి, వ్యాపార లావాదేవీలకు భద్రతను కల్పిస్తుంది.