SDPT: బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని సర్పంచ్ ముక్కిస కవిత తెలిపారు. మండలంలోని లక్ష్మిపూర్లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ సూచనలతో జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఉన్నారు.