MNCL: కోటపల్లి మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. కొల్లూరు గ్రామ శివారులో 40 ఏళ్ల వయస్సు గల మగ వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి సమాచారం అందించారు. బూడిద రంగుపై నలుపు డిజైన్ ఉన్న షర్టు, నలుపు రంగు ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిస్తే సంప్రదించాలని పోలీసులు తెలిపారు.