KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పునరుద్ధరణ కమిటీని ప్రభుత్వం మరో రెండు సంవత్సరాల పాటు పొడిగించింది. తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్గా శనిగరం కమలాకర్ రెడ్డి సహా 10 మంది సభ్యులను నియమించారు. ఆలయ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను ఈ కమిటీ చేపడుతుంది.