GDWL: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పచ్చర్ల గ్రామంలో ఆయన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఎన్నికల హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.