MDK: మెదక్ కలెక్టరేట్లో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ప్రతిమా సింగ్ పూలే చిత్రపటానికి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. సామాజిక అసమానతల నిర్మూలనకు, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని ఆమె కొనియాడారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.