ఢిల్లీలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. 11 మంది ISI ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బబ్సర్ఖల్సా టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల దగ్గరి నుంచి నాలుగు పిస్టల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశంలో సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీలు అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.