SS: జలధార-జలహారతి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువులు, కాలువలను త్వరితగతిన బాగు చేయాలన్నారు. మొబైల్ యాప్ వినియోగిస్తూ ప్రతి చెరువులోకి నీరు చేరేలా చూడాలన్నారు.