BDK: ఐపీఎల్ సీజన్ సందర్భంగా బెట్టింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని బయ్యారం ఎస్సై సురేష్ తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లో పాల్గొనడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.