VZM: సీతం కళాశాలలో ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్న ఉచిత పోలిసెట్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా.. ఇవాళ విద్యార్థులకు పోలిసెట్కు సంబంధించిన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బొత్స అనూష హాజరయ్యారు. సంస్థ అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.