ATP: గార్లదిన్నె మండలంలోని దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరీక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలోని డ్రోన్ ప్రయోగశాల, టెస్టింగ్ ల్యాబ్లు, అత్యాధునిక వ్యవసాయ పరికరాలను ఆయన పరిశీలించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన శిక్షణార్థులు, స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.