MBNR: తెలంగాణలో విద్య, వైద్య ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే నాణ్యమైన వైద్యం అందించేలా ఈ ఆసుపత్రిని కీలక కేంద్ర బిందువుగా మారుస్తామని హామీ ఇచ్చారు.