RR: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నందిగామ మండలం చేగూరు గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. యువత టోర్నమెంట్లో పాల్గొనడానికి ఉత్సాహం కనబరిచారు. యువతలో దాగిఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని క్రీడాకారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.