SRPT: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. 13వ తేదీ నుంచి వారం పాటు జిల్లావ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి ప్రాణాంతకమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.