మరణించిన వ్యక్తుల ఆధార్ కార్డులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ‘మై ఆధార్’ పోర్టల్లో డీయాక్టివేట్ చేసే సదుపాయం ఉంది. మరణ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేసి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. దీనివల్ల సైబర్ మోసాలను అరికట్టడంతో పాటు, మృతుల పేరిట జరిగే అనధికారిక ఆర్థిక లావాదేవీలకు చెక్ పెట్టవచ్చు. కుటుంబ సభ్యుల భద్రత కోసం ఇది ఎంతో అవసరం.