WNP: పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతుందంటూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతపై ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీ. శివకుమార్ విమర్శించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు.