మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్లో వాటర్ మెన్ మహేందర్ అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ గుండా సంతోష్ వారి నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ వాసులు కోస్గి వెంకటేష్ వెంకట్ రెడ్డి బాలు తదితరులు పాల్గొన్నారు