NRPT: ఉట్కూరు మండలం పెద్ద జట్రం గ్రామంలో ఈనెల 22న జరగనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమానికి రావాలని ఆదిత్య పరాశ్రీ స్వామిని నిర్వాహకులు ఆహ్వానించారు. ధర్మ రక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.