VKB: కోట్పల్లి మండల కేంద్రంలో మురికి కాలువ సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగు నీరు సరిగ్గా వెళ్లక దుర్వాసన వ్యాపిస్తోంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, గ్రామపాలకులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.