ADB: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. శనివారం నేరడిగొండ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ప్రారంభించారు. మార్కెట్ యార్డులో రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక రైతులు తదితరులున్నారు.