SDPT: గజ్వేల్లో మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసగించి పెళ్లి చేసుకున్న ప్రవీణ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రవి రాజు, SI కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండలానికి చెందిన బాలికను నిందితుడు మోసగించడంతో, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్కు తరలించారు.