కామారెడ్డి జిల్లాలో తీవ్ర ఎండల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు, చెరువులు అడుగంటుతున్నాయి. దీంతో పశువులకు, ఇతర జంతువులకు తాగునీరు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీటి కొరతతో పశువులు అల్లాడిపోతుండగా, రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి కొనసాగితే మరింత నీటి సంక్షోభం తీవ్రం అయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.