VKB: వికారాబాద్ మండలంలోని మద్గుల్ చిట్టెంపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు లక్ష్మయ్యపై స్థల వివాదం విషయంలో ఆదివారం గ్రామస్తుడు మల్లేశం దాడి చేసి అతడి ఎడమ చెయ్యిని విరగొట్టాడు. ప్రస్తుతం లక్ష్మయ్య వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.