MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాయ్స్ హై స్కూల్లో ఈనెల 18,19వ తేదీల్లో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్లను MLA ప్రేమ్ సాగర్ రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులందరికీ భోజన సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పాల్గొన్నారు.