రాత్రి 4-5 బాదం పప్పులను నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పొట్టులోని ‘టానిన్లు’ పోషకాల శోషణను అడ్డుకుంటాయి. నానబెట్టి పొట్టు తీయడం వల్ల విటమిన్లు, ఎంజైమ్లు శరీరానికి బాగా అందుతాయి. ఇది జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.