TG: చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మెప్పు పొందడానికే రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయకుండా తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారన్నారు. ఎల్నినో ప్రభావం పడితే, కరువు వస్తే, మేడిగడ్డ లేని లోటు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందన్నారు.