KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో కౌన్సిలర్ వరలక్ష్మీ శ్యాంబాబు ఆధ్వర్యంలో శనివారం అంగన్వాడీ కేంద్రానికి మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రానికి మంచినీరు ఇవ్వడం శుభపరిణామం అని తెలిపారు. గత ఎన్నో ఏళ్లుగా తాగునీరు లేక అంగన్వాడీ కేంద్రంలో అవస్థలు పడుతున్నారని అన్నారు.