NRPT: ధన్వాడ మండలం మణిపూర్ తాండ పాఠశాల ఉపాధ్యాయురాలు సునీత అకాల మరణం విద్యాశాఖకు తీరని లోటు అని తపస్ రాష్ట్ర కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా పాఠశాల అభివృద్ధి కోసం ఆమె తపించారని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల నుండి సేకరించిన రూ. 1,70,666 మొత్తాన్ని సునీత కుమార్తెల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉపాధ్యాయ లోకం మానవత్వాన్ని చాటుకుంది.